ఖమ్మం జిల్లా

ఆంధ్రపదేశ్ లో ఖమ్మం జిల్లా ఈశాన్య ప్రాంతంగా ఉంటుంది. ఖమ్మం తూర్పు రేఖాంశం 79.47 కు 80.47 మద్య గాను ఉత్తర అక్షాంశం 16.45’ కు 18.35’ మద్యగాను ఉండి 15,921 చ. కిలోమీటర్ల విస్టీర్ణంలో వ్యాపించి ఉన్నది. జిల్లాకు ఉత్తరమున మద్య ప్రదేశ్, చత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు , తూర్పున తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, పడమర నల్లగోండ, వరంగల్ జిల్లాలు, దక్షిణాన కృష్ణా జిల్లాలు సరిహద్దులుగా వున్నాయి. ఖమ్మం జిల్లా 1953 లొ పరిపాలనా సౌలబ్యం కొసము ఏర్పరచబడినది, అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం, మధిర, ఇల్లందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. 1959 లో అప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్ర్రాచలం, మణుగూరు, వెంకటాపురం రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు. మొదట దీనిని ఖమ్మం మెట్టు (పేజీ లేదు)" href="http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%96%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%82_%E0%B0%AE%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81&action=edit&redlink=1">ఖమ్మం మెట్టుగా పిలిచేవారు. ఖమ్మం అనే పేరు అదే పట్టణమందు కల నృసింహాద్రి అని పిలువబడే నారసింహాలయము నుండి వచ్చినట్టుగా, కాలక్రమేనా అది స్థంభ శిఖరిగాను ఆపై స్తంభాద్రి గా పిలువబడినట్టు చెప్పబడుతున్నది. ఉర్దు భాషలో కంబ అనగా రాతి స్తంభము కావున ఖమ్మం అను పేరు ఆ పట్టణము నందు కల రాతి శిఖరము నుండి వచ్చినట్టుగా మరొక వాదన. కౄరమయిన నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన యోధులను, నాయకులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. సింగరేణి బొగ్గు గనులతో, పచ్చని అడవులతో, పారే జీవనది గోదావరితో మరియు అధిక సంఖ్యలో గిరిజనులను కలిగియున్న ఈ జిల్లా విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీక.